మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 23, 2020 , 15:51:03

బాత్రూంలోకి దూరిన కొండ‌చిలువ.. ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది!

బాత్రూంలోకి దూరిన కొండ‌చిలువ..  ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది!

ఢిల్లీలోని ఒక ఇంటి బాత్రూంలోకి దూరిన కొండ‌చిలువ‌ను రెస్క్యూ టీం క్షేమంగా బ‌య‌ట‌కు తీసుకువ‌చ్చారు. ఇది సుమారు ఐదు అడుగుల పొడ‌వు ఉంటుంది. బాత్రూంలోకి వెళ్లిన కుటుంబ స‌భ్యులు కొండ‌చిలువ‌ను చూసి భ‌యంతో వైల్డ్‌లైఫ్ హెల్ప్‌లైన్ నెంబ‌ర్‌కు కాల్ చేశారు. ఈలోపు వీరికి ఎలాంటి హాని చేయ‌లేదు.

ఇంటికి చేరుకున్న‌ రెస్క్యూ టీం పైథాన్‌ను ర‌క్షించారు. కాక‌పోతే ఈ పైథాన్ బాగా అల‌సిపోవ‌డంతో అటూ ఇటూ క‌ద‌ల్లేని ప‌రిస్థితిలో ఉంది. ప్ర‌స్తుతం ఈ వ‌న్య‌ప్రాణి ప‌రిశీల‌న‌లో ఉంద‌ని ఎన్జీఓ తెలిపింది. వ‌ర్షాల కార‌ణంగా పాములు ఎక్కువ‌వుతున్నాయ‌ని వైల్డ్‌లైఫ్ రెస్క్యూకు చెందిన వ‌సీం అక్ర‌మ్ తెలిపారు. 


 

 


logo