బుధవారం 08 ఏప్రిల్ 2020
National - Mar 10, 2020 , 11:55:39

లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి

లోయలో పడ్డ బస్సు: ఐదుగురు మృతి

హిమాచల్‌ప్రదేశ్‌: రాష్ట్రంలోని చంబా జిల్లాలోని చెహ్లీ గ్రామ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాచల్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌కు చెందిన బస్సు లోయలో పడటంతో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, 35 మంది తీవ్రంగా గాయపడ్డురు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతులు యోగేశ్‌కుమార్‌(47), పూజా కుమారి(28), రాజీవ్‌కుమార్‌(37), మణిరామ్‌(33), దావాత్‌ అలీ(30)లుగా గుర్తించారు. చంబా నుంచి డెహ్రాడూన్‌ వెళుతున్న బస్సు ఉదయం 6:45 గంటలకు ప్రమాదానికి గురైంది.


logo