బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 27, 2020 , 16:52:13

దుర్గావిగ్రహ నిమజ్జనంలో అపశృతి.. ఐదుగురు మృతి

దుర్గావిగ్రహ నిమజ్జనంలో అపశృతి.. ఐదుగురు మృతి

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాలో దుర్గామాత విగ్రహ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. సోమవారం అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా నదిలో ఆరుగురు గల్లంతయ్యారు. బెల్దంగ ప్రాంతంలో నదిలో విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు రెండు పడవలను ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహాన్నినిమజ్జనం చేస్తుండగా విగ్రహం కిందపడి ఆరుగురు గల్లంతయ్యారు.

పోలీసులు, సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే నలుగురి మృతదేహాలను వెలికితీశాయి. మంగళవారం మరో మృతదేహం బయటపడింది. మిగిలిన మరో మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఐదు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో పండుగ వేళ స్థానికంగా విషాదం నెలకొంది. మృతి చెందిన వారంతా స్థానికులేనని పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.