బుధవారం 08 జూలై 2020
National - Jun 03, 2020 , 19:26:10

గుజ‌రాత్ పేలుడు ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి.. 57 మందికి గాయాలు

గుజ‌రాత్ పేలుడు ఘ‌ట‌న‌లో ఐదుగురు మృతి.. 57 మందికి గాయాలు

అహ్మ‌దాబాద్‌: గుజ‌రాత్ కెమిక‌ల్ కంపెనీలో సంభ‌వించిన‌ పేలుడు ఘ‌ట‌న‌లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 57 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రులను జిల్లాలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. భారీ పేలుడు అనంత‌రం పెద్ద ఎత్తున మంట‌లు ఎగిసి ప‌డ‌టంతో తీవ్ర న‌ష్టం జ‌రిగింద‌ని భ‌రూచ్ జిల్లా క‌లెక్ట‌ర్ ఎండీ మోడియా తెలిపారు. అక‌స్మాత్తుగా పేలుడు సంభ‌వించి మంట‌లు చెల‌రేగ‌డంతో కార్మికులు త‌ప్పించుకునేందుకు అవ‌కాశం దొర‌క‌లేద‌న్నారు.  

గుజ‌రాత్ రాష్ట్రం భ‌రూచ్ జిల్లాలోగ‌ల‌ దహేజ్ ఇండ‌స్ట్రియ‌ల్ ఎస్టేట్‌లోని ఓ కెమిక‌ల్ కంపెనీలో ఇవాళ మ‌ధ్యాహ్నం భారీ పేలుడు సంభ‌వించింది. య‌శ‌స్వి ర‌సాయ‌న్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. పేలుడు స‌మాచారం అందిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నా స్థలానికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పేశారు. పోలీసులు స్థానికుల సాయంతో  క్ష‌త‌గాత్రుల‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే, పేలుడుకుగ‌ల కారణాలు తెలియాల్సి ఉంద‌ని పోలీసులు చెప్పారు.  


logo