గురువారం 28 మే 2020
National - May 12, 2020 , 15:59:07

లక్ష వాహనాలు సీజ్‌.. 5 కోట్ల జరిమానా

లక్ష వాహనాలు సీజ్‌.. 5 కోట్ల జరిమానా

జైపూర్‌: లాక్‌డౌన్‌ సమయంలో వాహనాలపై తిరుగడం అన్నిరాష్ట్రాల్లో సర్వసాధారణం కావడంతో తెలంగాణ సహా కొన్ని రాష్ట్రాల పోలీసులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉపక్రమించిన వాహనాలను సీజ్‌ చేసి వారి నుంచి జరిమానా వసూలు చేశారు. ఇలా రాజస్థాన్‌లో ఏకంగా  1.28 లక్షల వాహనాలను సీజ్‌ చేసి వారి నుంచి దాదాపు రూ.5 కోట్ల వరకు జరిమానా  వసూలు చేసినట్లు అదనపు డైరెక్టర్‌ జనరల్‌ (క్రైమ్స్‌) బీఎల్‌ సోనీ చెప్పారు. నిబంధనలు అతిక్రమించిన మరో 14,400 మందిని అరెస్ట్‌ చేసినట్లు ఆయన వెల్లడించారు. కరోనా వ్యాధిగ్రస్థులకు సేవచేస్తున్న వైద్యులు, వైద్యసిబ్బంది, ఇతర ఉద్యోగులపై దాడికి పాల్పడిన 409 మందిని అరెస్ట్‌ చేసి  జైలుకు పంపినట్లు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు వార్తలు ప్రచురించిన 199 మందిపై కేసులు నమోదుచేశామని, ప్రజల అవసరాలను సొమ్ముచేసుకొనేందుకు బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడిన 121 మంది వ్యాపారులపై కూడా కేసులు పెట్టామని బీఎల్‌ సోనీ వెల్లడించారు.


logo