శనివారం 30 మే 2020
National - May 12, 2020 , 18:18:38

కేరళలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

కేరళలో కొత్తగా ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు

తిరువనంతపురం: కేరళలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మంగళవారం కొత్తగా ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ తెలిపారు. కొత్తగా నమోదైన కేసుల్లో నలుగురు విదేశాల నుంచి రాగా..ఒక్కరు చెన్నై నుంచి రాష్ట్రానికి తిరిగొచ్చారని చెప్పారు. 

ప్రస్తుతం కేరళలో 32 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇవాళ ఒక్కరు కూడా డిశ్చార్జ్‌ కాలేదు. మంగళవారం సాయంత్రం వరకు రాష్ట్రంలో 524 మందికి వైరస్‌ సోకింది. 33,116 మంది దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి రోడ్డు మార్గంలో రాష్ట్రానికి చేరుకోగా 1,406 మంది ప్రజలు విమానాల ద్వారా, 833 మంది షిప్‌లో కేరళకు చేరుకున్నారు.logo