ఆదివారం 25 అక్టోబర్ 2020
National - Aug 09, 2020 , 18:20:40

తమిళనాడులో ఒకేరోజు 5,994 కరోనా కేసులు.. 119 మరణాలు

తమిళనాడులో ఒకేరోజు 5,994 కరోనా కేసులు.. 119 మరణాలు

చెన్నై: తమిళనాడులో కరోనా తీవ్రత మరింతగా పెరుగుతున్నది. శనివారం నుంచి ఆదివారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,994 కేసులు నమోదు కాగా 119 మంది మరణించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా సోకిన వారి మొత్తం సంఖ్య 2,96,901కి, చనిపోయిన వారి సంఖ్య 4,927కి చేరింది. ఇప్పటి వరకు 2,38,638 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయ్యారని, ప్రస్తుతం 53,336 యాక్టివ్ కేసులు ఉన్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
logo