గురువారం 04 జూన్ 2020
National - May 08, 2020 , 15:43:20

ఢిల్లీలో కరోనా కేసులు 6 వేలకు చేరువలో

ఢిల్లీలో కరోనా కేసులు 6 వేలకు చేరువలో

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇప్పటివరకు మొత్తం 5980 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కొత్తగా 448 కరోనా కేసులు రికార్డయ్యాయని, 398 మంది బాధితులు చికిత్స అనంతరం కోలుకున్నారని ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేద్రజైన్‌ వెల్లడించారు. మొత్తంగా 1931 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారని, చికిత్స పొందుతున్నవారిలో 87 మంది ఐసీయూలో ఉన్నారని, మరో 13 మంది వెంటీలేటర్‌పై ఉన్నారని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో కోవిడ్‌-19 కేర్‌ సెంటర్‌ రెండు మూడు రోజుల్లో ప్రారంభమవుతుందని తెలిపారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా వైరస్‌తో 66 మంది మరణించారు.


logo