ఆదివారం 09 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 20:03:48

తమిళనాడులో 5879 కరోనా కేసులు

తమిళనాడులో 5879 కరోనా కేసులు

చెన్నై : తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా 5,879 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పటివరకు కరోనా వైరస్ కు గురైన వారి సంఖ్య 2,51,738 గా నమోదైందని తమిళనాడు ఆరోగ్య అధికారులు శనివారం తెలిపారు. 

రాష్ట్రంలో తాజాగా 99 మరణించగా.. ఆ సంఖ్య 4,034 కు పెరిగింది. వివిధ దవాఖానల నుంచి 7,010 మంది కొవిడ్ రోగులను డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 190,966 కు చేరుకుంది. నయమైన, చనిపోయినవారిని పరిగణనలోకి తీసుకున్న తరువాత రాష్ట్రంలో క్రియాశీల కొవిడ్-19 కేసుల సంఖ్య 56,738 గా ఉంది. 0-12 సంవత్సరాల వయస్సులో కరోనా వైరస్ సోకిన పిల్లల సంఖ్య 12,536 కు పెరిగింది. కాగా, రాష్ట్ర రాజధాని చెన్నైలో 1,074 మంది పాజిటివ్ గా తేలగా.. మొత్తం 100,877 కు చేరుకున్నది. చెన్నై నగరంలో చురుగ్గా ఉన్న కేసులు 12,436 కాగా, చెన్నైలో డిశ్చార్జ్ అయిన కొవిడ్-19 రోగుల సంఖ్య 1,385 గా ఉంది.


logo