శనివారం 08 ఆగస్టు 2020
National - Aug 02, 2020 , 18:39:30

తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా

తమిళనాడులో విజృంభిస్తున్న కరోనా

చెన్నై: తమిళనాడులో ప్రతిరోజు పెద్ద ఎత్తున కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి.  ఆదివారం కూడా రికార్డు స్థాయిలో మరో 98 కరోనా మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 4,132కు పెరిగింది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా  5,875 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య   2,57,613కు చేరింది.

ఇప్పటి వరకు 1,96,483 మంది  డిశ్చార్జ్‌ అయ్యారు. 24 గంటల్లోనే 60,344 శాంపిల్స్‌ టెస్టు చేసినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.  రాజధాని చెన్నైలోనే కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటింది. రాష్ట్రంలో అత్యధికంగా చెన్నైలోనే కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్నది.logo