సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 19:28:22

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌రింత ఉధృతం

త‌మిళ‌నాడులో క‌రోనా మ‌రింత ఉధృతం

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి వేగంగా విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వేల సంఖ్య‌లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్తగా 5,849 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,86,492కు చేరింది. అందులో వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయిన వారు పోగా మ‌రో 51,765 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 

ఇక క‌రోనా మ‌ర‌ణాలు కూడా త‌మిళ‌నాడులో భారీగా న‌మోద‌వుతున్నాయి. బుధ‌వారం కూడా కొత్త‌గా 74 మంది క‌రోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో త‌మిళ‌నాడులో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2700కు చేరింది. త‌మిళ‌నాడు ఆరోగ్యశాఖ అధికారులు ఈ వివ‌రాలను వెల్ల‌డించారు.           

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo