సోమవారం 28 సెప్టెంబర్ 2020
National - Aug 13, 2020 , 18:32:14

తమిళనాడులో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు.. 119 మరణాలు

తమిళనాడులో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు.. 119 మరణాలు

చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత కొనసాగుతున్నది. బుధవారం నుంచి గురువారం వరకు గత 24 గంటల్లో కొత్తగా 5,835 పాజిటివ్ కేసులు, 119 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,20,355కు, మరణాల సంఖ్య 5,397కు చేరింది.

కాగా, గత 24 గంటల్లో 5,146 మంది కరోనా రోగులు కోలుకుని దవాఖానల నుంచి డిశ్చార్జ్ అయినట్లు తమిళనాడు ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో ఇప్పటి వరకు 2,61,459 మంది కోలుకోగా ప్రస్తుతం 53,499 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొంది.




logo