ఆదివారం 05 జూలై 2020
National - Jun 14, 2020 , 22:09:49

గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.8గా నమోదు

గుజరాత్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 5.8గా నమోదు

రాజ్‌కోట్‌ : గుజరాత్‌ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. ఆ రాష్ట్రంలోని రాజ్‌కోట్‌, పటాన్‌ జిల్లాలో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై 5.8గా భూకంప తీవ్రత నమోదైనట్లు జాతీయ భూకంప అధ్యాయన కేంద్రం తెలిపింది. రాజ్‌కోట్‌ సమీప ప్రాంతాలకు 122 కిలోమీటర్ల దూరంలో వాయవ్యంగా ఆదివారం రాత్రి 8 గంటల 13 నిమిషాలకు ఈ భూకంపం సంభవించింది.  ఆ రాష్ట్ర సీఎం విజయ్‌ రూపాని వెంటనే రాజ్‌కోట్‌, కచ్‌, పటాన్‌ జిల్లాల కలెక్టర్‌తో  ఫోన్‌లో మాట్లాడి భూప్రకంపనలపై ఆరా తీసి అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సీఎంఓ కార్యాలయం తెలిపింది. భూప్రకంపనల నేపథ్యంలో జనం భయాందోళనకు గురై ఒక్కసారిగా ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా జుమ్ము, కశ్మీర్‌కు 90కిలోమీటర్ల దూరంలో తూర్పున మరో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 3.0గా నమోదైంది.logo