శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 20:26:17

కర్ణాటకలో కొత్తగా 5,503 కరోనా కేసులు.. 92 మరణాలు

కర్ణాటకలో కొత్తగా 5,503 కరోనా కేసులు.. 92 మరణాలు

బెంగళూరు : కర్ణాటకలో కరోనా విలయం సృష్టిస్తున్నది. రోజు రోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. ఇప్పటి వరకు లక్షకుపైగా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ కావడంతో ఆందోళన కలిగిస్తున్నది. తాజాగా బుధవారం కొత్తగా 5,503 కొవిడ్‌-19 కేసులు నిర్ధారణ కాగా, ఒకే రోజు 90 మంది వైరస్‌తో చనిపోయారు. ఇవాళ 2,397 మంది డిశ్చార్జి అయ్యారని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు మొత్తం 1,12,504కు చేరగా, ఇందులో 67,448 యాక్టివ్‌ కేసులున్నాయి. మరో 42,901 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. వైరస్‌తో మొత్తం 2,155 మంది మరణించారు. ఇదిలా ఉండగా దేశంలో బుధవారం కరోనా కేసులు 15లక్షల మార్కును దాటాయి. ప్రస్తుతం 15.31లక్షల పాజిటివ్‌ కేసులుండగా.. వైరస్‌తో 786 మంది గడిచిన 24 గంటల్లో మృతి చెందగా, మొత్తం మృతుల సంఖ్య 34,193కు చేరాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ చెప్పింది.logo