సోమవారం 06 జూలై 2020
National - Jun 15, 2020 , 08:36:44

గుజరాత్‌లో భూకంపం.. 5.5 తీవ్రత

గుజరాత్‌లో భూకంపం.. 5.5 తీవ్రత

గాంధీనగర్‌: గుజరాత్‌లోని రాజ్‌కోట్‌ సమీపంలో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 5.5గా నమోదైనట్టు  నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ (ఎన్‌సీఎస్‌) వెల్లడించింది. ఆరు నిమిషాల తర్వాత మరోమారు భూకంపం సంభవించిందని, దాని తీవ్రత 3.1గా ఉందని తెలిపింది. రాజ్‌కోట్‌కు వాయువ్యంగా 118 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్లు తెలిపింది. సౌరాష్ట్రలో, అహ్మదాబాద్‌తో సహా ఉత్తర గుజరాత్‌లోని చాలా ప్రాంతాల్లో భూకంప ప్రభావం ఉంది. కాగా, భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని ఉపముఖ్యమంత్రి నితిన్‌ పటేల్‌ వెల్లడించారు. 

కాగా 2001లో జనవరి 26న గుజరాత్‌లోని భుజ్‌ ప్రాంతంలో సంభవించిన భూకంప ప్రాంతానికి ప్రస్తుత ప్రాంతం 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. భుజ్‌ భూకంపం వల్ల 20 వేల మంది మరణించగా, 1.5 లక్షల మంది గాయపడ్డారు.


logo