మంగళవారం 14 జూలై 2020
National - Jun 21, 2020 , 17:34:16

మిజోరంలో భూకంపం

మిజోరంలో భూకంపం

న్యూఢిల్లీ : ఈశాన్య రాష్ర్ట‌మైన మిజోరంలోని ఐజ్వాల్ జిల్లాలో భూకంపం సంభ‌వించింది. ఆదివారం సాయంత్రం 4:16 గంట‌ల‌కు భూమి కంపించిన‌ట్లు జాతీయ భూకంప కేంద్రం వెల్ల‌డించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 5.1గా న‌మోదైన‌ట్లు తెలిపింది. ఐజ్వాల్ కు తూర్పు దిశ‌గా 25 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైన‌ట్లు పేర్కొంది. పొరుగు రాష్ర్ట‌లైన అసోం, మేఘాల‌య‌, మ‌ణిపూర్ లో కూడా స్వ‌ల్ప భూప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. 

జ‌మ్మూక‌శ్మీర్ లోని రాజౌరి జిల్లాలో కూడా ఆదివారం ఉద‌యం స్వ‌ల్ప భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేలుపై భూకంప తీవ్ర‌త 2.6గా న‌మోదైంది. రాజౌరికి ప‌శ్చిమ దిశ‌గా 61 కిలోమీట‌ర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృత‌మైంది. జూన్ 19వ తేదీన హ‌ర్యానాలోని రోహ‌త‌క్ లోనూ భూకంపం సంభ‌వించింది. 

 


logo