బుధవారం 20 జనవరి 2021
National - Jan 11, 2021 , 21:28:13

క‌శ్మీర్‌లో భూకంపం.. కిష్వార్‌, ఉధంపూర్ ల‌లో ప్ర‌కంప‌న‌లు

క‌శ్మీర్‌లో భూకంపం.. కిష్వార్‌, ఉధంపూర్ ల‌లో ప్ర‌కంప‌న‌లు

శ్రీ‌న‌గ‌ర్‌: జ‌మ్ముక‌శ్మీర్‌లోని కిష్వార్ జిల్లాలో సోమ‌వారం భూకంపం సంభ‌వించింది. రిక్ట‌ర్ స్కేల్‌పై దాని తీవ్ర‌త 5.1గా న‌మోదైంది. దీని ప్ర‌భావంతో కిష్వార్‌, ఉధంపూర్ జిల్లాల్లో భూప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. సిస్మోలాజీ ఆఫ్ నేష‌న‌ల్ సెంట‌ర్ స్పందిస్తూ.. రిక్ట‌ర్ స్కేల్ పై భూకంప తీవ్ర‌త 5.1గా న‌మోదైంది. కిష్వార్‌కు స‌మీపంలోని 33.29ఎన్‌, 75.52ఈ భూకంపానికి కేంద్రంగా ఉన్నాయ‌ని తెలిపింది.

ఇప్ప‌టివ‌ర‌కు ప్రాణ‌న‌ష్టం జ‌రిగిన‌ట్లు వార్త‌లు రాలేదు. దోడా జిల్లా మేజిస్ట్రేట్ మాట్లాడుతూ జిల్లా ప్ర‌జ‌లు ఆందోళ‌న‌కు గురి కావొద్ద‌ని అభ్య‌ర్థించారు. భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కోరారు. వివిధ ప్రాంతాల్లో ఏమైనా న‌ష్టం వాటిల్లితే త‌క్ష‌ణం నివేదించాల‌ని తాహ‌సీల్దార్లు, ఎస్‌హెచ్‌వోల‌ను ఆదేశించారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo