గురువారం 09 జూలై 2020
National - Jun 14, 2020 , 19:26:36

యూపీలో కరోనా విజృంభణ

యూపీలో కరోనా విజృంభణ

లక్నో : ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నది. 24గంటల వ్యవధిలో ఆ రాష్ట్రంలో 499 కేసులు నమోదుకాగా యాక్టివ్‌ కేసుల సంఖ్య 4,948కి చేరిందని ప్రిన్సిపల్‌ హెల్త్‌ సెక్రటరీ అమిత్‌ మోహన్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్న వారి శాతం 60కిపైగా ఉండగా ఇప్పటి వరకు 8,268మంది దవాఖానలో చికిత్స పొందుతున్నారని వీరంతా కోలుకునే అవకాశముందని పేర్కొన్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా శనివారం దాదాపు 15,762 శ్యాంపిళ్లను పరీక్షించినట్లు వెల్లడించారు.  రోజుకు దాదాపు 20వేల శ్యాంపిళ్లను పరీక్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, జూన్‌ 30 నాటికి 4,56,213 శ్యాంపిళ్లను పరీక్షిస్తామని తెలిపారు. బహుళ అంతస్తుల భవనంలో కరోనా కేసులు నమోదైతే వాటిని సీజ్‌ చేసే నిబంధనల్లో సవరణలు తీసుకువచ్చామన్నారు. గతంలో   21రోజులపాటు సీజ్‌ చేయగా ప్రస్తుతం 14రోజులకు కుదించినట్లు స్పష్టం చేశారు.logo