గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 07:03:23

బీహార్ లో 49 పాజిటివ్ కేసులు

బీహార్ లో 49 పాజిటివ్ కేసులు

పాట్నా:  బీహార్ లో క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. కొత్త‌గా 49 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో రాష్ట్రం లో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసులు 879కు చేరుకున్నాయి. పాజిటివ్ గా నిర్దార‌ణ అయిన వారికి ఇన్ ఫెక్ష‌న్ ఎలా ఉందో విశ్లేషిస్తున్నామ‌ని బీహార్ వైద్యారోగ్య ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ సంజయ్ కుమార్ తెలిపారు. అన్ని రాష్ట్రాల‌తోపాటు బీహార్ లో కూడా మూడో ద‌శ లాక్ డౌన్ కొన‌సాగుతుంది. కంటైన్ మెంట్ జోన్లు మిన‌హా మిగిలిన ప్రాంతాల్లో ప్ర‌భుత్వం కొన్ని స‌డ‌లింపులు ఇచ్చింది. 



ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo