శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 09:34:10

దేశంలో 14 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్‌లు

దేశంలో 14 ల‌క్ష‌లు దాటిన క‌రోనా పాజిటివ్‌లు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా వైర‌స్‌ అంత‌కంత‌కు విజృంభిస్తున్న‌ది. ప్ర‌తి రోజు వేల సంఖ్య‌లో న‌మోద‌వుతున్నాయి. దీంతో ‌క‌రోనా కేసులు 14 ల‌క్ష‌ల మార్కును దాటాయి. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 49,931 మంది క‌రోనా బారిన‌పడ‌గా, 708 మంది మ‌ర‌ణించారు. దేశంలో ఒక్క‌రోజులో ఇంత పెద్ద‌మొత్తంలో క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు న‌మోద‌వ‌డం ఇదే మొద‌టిసారి. 

దీంతో దేశవ్యాప్తంగా క‌రోనా కేసులు 14,35,453కు దాటాయి. ఇందులో 4,85,114 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 9,17,568 మంది క‌రోనా నుంచి కోలుకుని ద‌వాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. నిన్న ఉద‌యం నుంచి నేటి ఉద‌యం వ‌ర‌కు 708 మంది మ‌ర‌ణించ‌డంతో దేశంలో మొత్తం మ‌ర‌ణాలు 32,771కి పెరిగాయ‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది. 

జూలై 26 వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా 1,68,06,803 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండలి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. నిన్న ఒకేరోజు అత్య‌ధికంగా 5,15,472 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని తెలిపింది.    


logo