గురువారం 13 ఆగస్టు 2020
National - Jul 24, 2020 , 09:49:08

30 వేలు దాటిన క‌రోనా మృతులు.. ఒకేరోజు 49 వేల కేసులు

30 వేలు దాటిన క‌రోనా మృతులు.. ఒకేరోజు 49 వేల కేసులు

న్యూఢిల్లీ: దేశంలో క‌రోనా ర‌క్క‌సి విళ‌య‌తాండం చేస్తున్న‌ది. అన్ని రాష్ట్రాల్లో వైర‌స్ బారిన ప‌డిన‌వారి సంఖ్య పెరిగిపోతుండ‌టంతో కేవ‌లం వారం రోజుల్లోనే 2.6 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌య్యాయి. గ‌త వారం రోజులుగా ప్ర‌తిరోజు 35 వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌గా, గురువారం 45 వేల మంది క‌రోనా బారిన‌ప‌డ్డారు. తాజాగా ఈరోజు 50 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు రికార్డ‌య్యాయి.

దేశంలో గ‌త 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 49,310 మంది క‌రోనా పాజిటివ్‌లుగా నిర్ధార‌ణ అయ్యారు. దీంతో దేశ‌వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 12,87,945కు చేరింది. ఇందులో 4,40,135 యాక్టివ్ కేసులు ఉండ‌గా, 8,17,209 మంది కోలుకున్నారు. ఈ వైర‌స్ వ‌ల్ల ఇప్ప‌టివ‌ర‌కు 30,601 మంది చ‌నిపోయారు. నిన్న ఒకేరోజు కొత్త‌గా 720 మంది మృతిచెందార‌ని కేంద్ర ఆరోగ్య శాఖ ప్ర‌క‌టించింది.  

దీంతో రోజువారి క‌రోనా కేసుల్లో బ్రెజిల్‌ను వెన‌క్కి నెట్టిన భార‌త్‌, అమెరికా త‌ర్వాత రెండోస్థానంలో నిలిచింది. దేశంలో వారం రోజుల్లోనే (జూలై 16 నుంచి 22 వ‌ర‌కు) 2,69,969 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. నిన్న రికార్డు స్థాయిలో 45,720 క‌రోనా కేసులు రికార్డ‌య్యాయి. అమెరికాలో గ‌త 24 గంట‌ల్లో 76 వేల‌కుపైగా క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 

నిన్న 3,52,801 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని ఇండియ‌న్ మెడిక‌ల్ కౌన్సిల్ (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. అదేవిధంగా జూలై 23 వ‌ర‌కు దేశంలో 1,54,28,170 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని వెల్ల‌డించింది. 


logo