గురువారం 28 మే 2020
National - May 13, 2020 , 12:53:01

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్యాధికారులు వెల్లడించారు. దీంతో ఏపీలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2137కు చేరింది. గత 24 గంటల్లో అనంతపూర్‌లో 3, చిత్తూరులో 11, తూర్పుగోదావరిలో 4, గుంటూరులో 12, కృష్ణాలో 3, కర్నూల్‌లో 7 కేసులు నమోదు కాగా, 8 మంది వలస కార్మికులకు కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో 47 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 1142 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo