శనివారం 30 మే 2020
National - May 15, 2020 , 11:49:24

ఒడిశాలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు

ఒడిశాలో కొత్తగా 48 కరోనా పాజిటివ్‌ కేసులు

భువనేశ్వర్‌: ఒడిశాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 48  కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 672కు చేరుకుంది. గంజాం జిల్లాలో 12, బాలసోర్‌లో 12, పూరిలో 10, భద్రక్‌లో 6, నయగర్‌లో 3, జాజ్‌పూర్‌ లో 2, కటక్‌, సుందర్‌గడ్‌, డియోగర్‌, జిల్లా నుంచి ఒక్కో కేసు నమోదైందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. వీరిలో ఎక్కువ మంది గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, ఢిల్లీ, మహారాష్ట్ర తదితర  రాష్ర్టాల నుంచి ఒడిశాకు చేరుకున్న వారేనని పేర్కొన్నారు. ఒడిశాలోని మొత్తం 30 జిల్లాలకు 21 జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో 511 మంది చికిత్స పొందుతుండగా, 158 మంది చికిత్స అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చర్‌ అయ్యారు. కరోనా బారిన పడి ముగ్గురు మృతి చెందారు. 


logo