మంగళవారం 24 నవంబర్ 2020
National - Oct 30, 2020 , 09:56:55

దేశంలో కొత్త‌గా 48 వేల క‌రోనా కేసులు

దేశంలో కొత్త‌గా 48 వేల క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కొత్త‌గా 48,648 కోరానా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో క‌రోనా బాధితుల సంఖ్య 80,88,851కి చేరింది. ఇందులో 5,94,386 కేసులు యాక్టివ్‌గా ఉండ‌గా, మ‌రో 73,73,375 మంది కోలుకుని ఇంటికి చేరారు. గ‌త 24 గంట‌ల్లో కొత్త‌గా 57,386 మంది డిశ్చార్జి అయ్యారు. నిన్న ఉద‌యం నుంచి ఇప్ప‌టివ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి‌వ‌ల్ల 563 మంది మృతిచెందారు. దీంతో క‌రోనా మృతుల సంఖ్య 1,21,090కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. 

దేశ‌వ్యాప్తంగా అక్టోబ‌ర్ 29 నాటికి 10,77,28,088 న‌మూనాల‌ను ప‌రీక్షించామ‌ని భార‌తీయ వైద్య ప‌రిశోధ‌నా మండ‌లి (ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. ఇందులో నిన్న ఒకేరోజు 11,64,648 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించామ‌ని తెలిపింది.