బాలీవుడ్ బ్యూటీ కంగనారనౌత్ లీడ్ రోల్లో నటిస్తోన్న చిత్రం తలైవి. దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా వస్తోంది. ఏఎల్ విజయ్ డైరెక్షన్లో వస్తున్న తలైవి నుంచి ‘ఇలా ఇలా తేలాను’ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. కంగనా తెలుపు శారీలో 60-70 బ్యాక్డ్రాప్లో వర్షంలో వచ్చే పాటతో జయలలితలా అప్పట్లో యూత్, మాస్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నట్టుగా తన అభినయం, డ్యాన్స్ తో అదరగొడుతోంది.
మరోవైపు ప్యాంట్ షర్ట్, స్కర్ట్ కాస్ట్యూమ్స్ లో కూడా అలరిస్తోంది కంగనా. జీవీ ప్రకాశ్ మ్యూజిక్ కంపోజిషన్ లో రూపొందిన ఈ పాటను సిరాశ్రీ రాయగా..సైంధవి పాడింది. విష్ణు వర్థన్ ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ట్రైలర్ కు అద్బుతమైన స్పందన రాగా..తాజాగా విడుదల చేసిన పాట కూడా మంచి హైప్ తీసుకొస్తుంది. తలైవి రషెస్ చూస్తుంటే మూవీ బిజినెస్ బాగానే జరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో నటిస్తున్నాడు. మధుబాల ఆయన సతీమణిగా నటిస్తోంది.