శనివారం 06 జూన్ 2020
National - May 16, 2020 , 19:38:19

కొత్త‌గా 477 కేసులు.. మూడు మరణాలు

కొత్త‌గా 477 కేసులు.. మూడు మరణాలు

చెన్నై: తమిళనాడులో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రోజురోజుకు వందల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. శనివారం కొత్తగా 477 మందికి కరోనా వైరస్‌ సోకింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 10,585కు చేరింది. ఇక మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతున్నది. శనివారం కొత్తగా మరో ముగ్గురు మృతిచెందడంతో మొత్తం మరణాల సంఖ్య 74కు చేరింది. అయితే, మొత్తం కేసులలో 6,970 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు మొత్తం 3,538 మంది వైరస్‌ నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. తమిళనాడు ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివరాలను వెల్లడించారు.  


logo