సోమవారం 06 జూలై 2020
National - Jun 03, 2020 , 12:16:43

మరో 47 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

మరో 47 మంది పోలీస్‌ సిబ్బందికి కరోనా పాజిటివ్‌

ముంబై : మహారాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనా వైరస్‌ భారిన పడుతున్న సిబ్బంది సంఖ్య రోజురోజుకి పెరుగుతూ పోతుంది. గడిచిన 24 గంటల్లో మరో 47 మంది పోలీస్‌ సిబ్బంది కరోనా వైరస్‌ భారిన పడ్డాడు. నేడు వెల్లడైన ఫలితాల్లో వీరంతా కోవిడ్‌-19 భారిన పడ్డట్లుగా సమాచారం. ఇప్పటి వరకు మహారాష్ట్ర పోలీస్‌శాఖలో 2,556 మంది కరోనా వైరస్‌ భారిన పడ్డారు. 29 మంది పోలీస్‌ సిబ్బంది కోవిడ్‌-19 కారణంగా మరణించారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తెలిపిన వివరాల ప్రకారం మహారాష్ట్రలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 72,300కు చేరుకుంది.


logo