మంగళవారం 26 మే 2020
National - May 23, 2020 , 13:01:42

ఏపీలో కొత్తగా 47 కరోనా పాటివ్‌లు

ఏపీలో కొత్తగా 47 కరోనా పాటివ్‌లు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 47 పాజిటివ్‌ కేసులు నమోదవగా, ఒకరు మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2561కి పెరిగింది. ఈ వైరస్‌తో ఇప్పటివరకు 56 మంది బాధితులు మృతిచెందారని రాష్ట్ర నోడల్‌ అధికారి శ్రీకాంత్‌ వెల్లడించారు. ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల్లో 727 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1778 మంది బాధితులు కోలుకున్నారు. ఈ రోజుల నమోదైన కేసుల్లో చిత్తూరులో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు తమిళనాడులోని కోయంబేడు మార్కెట్‌కు వెళ్లివచ్చారని ఆయన తెలిపారు.


logo