సోమవారం 25 మే 2020
National - Apr 02, 2020 , 19:10:44

ప్రార్థనలకు వెళ్లిన వారిలో 46 మంది గుర్తింపు..

ప్రార్థనలకు వెళ్లిన వారిలో 46 మంది గుర్తింపు..

గోవా:  ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్‌  లో  తబ్లిగీ జమాత్‌ సంస్థ నిర్వహించిన మత ప్రార్థనల్లో పాల్గొన్న 46 మందిని గుర్తించామని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ తెలిపారు. 46 మందిని గోవాలో క్వారంటైన్‌కు తరలించామన్నారు. వీరిలో ఇతర రాష్ర్టాల వారున్నారు. వారు గోవాకు ఎందుకు వచ్చారనేది తెలియాల్సి ఉంది. వీరికి సంబంధించిన పూర్తి వివరాలు రేపటి వరకు వస్తాయి. గోవాలో ఇంకెవరైనా ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారున్నారో గుర్తించేందుకు అధికారులు, పోలీసులు పనిచేస్తున్నారని సీఎం ప్రమోద్‌ సావంత్‌ వెల్లడించారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo