సోమవారం 06 జూలై 2020
National - Jun 18, 2020 , 13:08:04

కరోనాతో 45 మంది పోలీసుల మృతి

కరోనాతో 45 మంది పోలీసుల మృతి

ముంబై: కరోనా వైరస్‌తో రాష్ట్రంలో ఇప్పటివరకు 45 మంది పోలీసులు మరణించారని మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా 3820 మంది పోలీసులకు కరోనా వైరస్‌ సోకిందని హోం శాఖ మంత్రి డా. అనిల్‌ దేశ్‌ముఖ్‌ వెల్లడించారు. ఇందులో 2754 మంది కోలుకున్నారని, 45 మంది పోలీసులు మరణించారని ట్వీట్‌ చేశారు. 

రాష్ట్రంలో ఇప్పటివరకు ఆరు లక్షలకుపైగా మందిని క్వారంటైన్‌ చేశామని, 122 పునరావాస కేంద్రాలను ప్రభుత్వం నడుతున్నదని చెప్పారు. ఇతర రాష్ర్టాలకు చెందిన 4,138 మంది కార్మికులకు ఆశ్రయం కల్పించామని తెలిపారు. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 1,16,752కు చేరింది. రాష్ట్రంలో ఈ వైరస్‌వల్ల 5,651 మంది మరణించారు.


logo