ఆదివారం 07 జూన్ 2020
National - Mar 31, 2020 , 20:28:43

తమిళనాడు.. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 45 మందికి పాజిటివ్‌

తమిళనాడు.. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 45 మందికి పాజిటివ్‌

చెన్నై : తమిళనాడు నుంచి మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారిలో 45 మంది వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా వచ్చిందని ఆ రాష్ట్ర హెల్త్‌ సెక్రటరీ బీలా రాజేష్‌ తెలిపారు. ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌లో జరిగిన మత ప్రార్థనల్లో తమిళనాడు రాష్ట్ర నుంచి 1500 మంది హాజరైనట్లు ఆమె తెలిపారు. వీరిలో 1130 మంది తిరిగి తమిళనాడుకు చేరుకున్నారన్నారు. మిగతావారు ఢిల్లీలోనే ఉన్నట్లు చెప్పారు. అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు 515 మంది గుర్తించినట్లు తెలిపారు. వీరందరికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. మర్కజ్‌కు వెళ్లివచ్చిన వారు కాకుండా రాష్ట్రంలో నేడు కొత్తగా మరో ఐదు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయన్నారు. మొత్తంగా రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 124కు చేరుకుందన్నారు.

ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో గల మర్కజ్‌ భవనంలో ఈ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మత ప్రార్థనలు జరిగాయి. ఈ ప్రార్థనల్లో సుమారు 1500 నుంచి 1700 మంది వరకు పాల్గొన్నారు. ఈ ప్రార్థనలకు హాజరైన పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు రంగంలోకి దిగి ప్రార్థనలకు హాజరైన వారిని గుర్తించి క్వారంటైన్‌కు తరలిస్తున్నాయి.


logo