శనివారం 04 ఏప్రిల్ 2020
National - Mar 13, 2020 , 13:33:24

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో 45 లక్షలు స్వాధీనం

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులో 45 లక్షలు స్వాధీనం

కృష్ణా : జిల్లాలోని కంచికచర్ల పోలీసు స్టేషన్‌ పరిధిలో రూ. 45.5 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కీసర టోల్‌ గేటు వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఏపీఎస్‌ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా ఓ ప్రయాణికుడి వద్ద రూ. 45.5 లక్షలను గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఈ బస్సు జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్తుండగా పోలీసులు తనిఖీలు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగదు కలిగి ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


logo