శనివారం 04 జూలై 2020
National - Jun 25, 2020 , 18:39:00

త‌మిళ‌నాడులో ఒక్క‌రోజే 45 క‌రోనా మ‌ర‌ణాలు

త‌మిళ‌నాడులో ఒక్క‌రోజే 45 క‌రోనా మ‌ర‌ణాలు

చెన్నై: త‌మిళ‌నాడులో క‌రోనా మ‌హ‌మ్మారి విస్త‌ర‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉన్న‌ది. ప్రతి రోజు వేల‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. గురువారం కూడా కొత్త‌గా 3,509 మందికి క‌రోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 70,977కు చేరింది. ఇక మ‌ర‌ణాలు కూడా ప్ర‌తిరోజు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతూనే ఉన్నాయి. గురువారం కొత్త‌గా 45 మంది క‌రోనా బాధితులు మృతిచెంద‌డంతో మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 911కు చేరింది. కాగా, మొత్తం కేసుల‌లో 30,064 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మ‌హారాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.   


logo