శనివారం 30 మే 2020
National - May 14, 2020 , 20:35:30

తమిళనాడులో ఒక్కరోజే 447 కరోనా కేసులు

తమిళనాడులో ఒక్కరోజే 447 కరోనా కేసులు

చెన్నై: తమిళనాడులో రోజురోజుకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. గురువారం సాయంత్రానికి కొత్తగా 447 కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. గురువారం నాడు కరోనా వైరస్‌తో ఇద్దరు చనిపోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,664కు చేరుకోగా 66 మంది చనిపోయారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొంటున్నా పాజిటివ్‌ కేసులు మాత్రం నిలువడంలేదు. చెన్నై సహా పలు నగరాల్లో లాక్‌డౌన్‌ను పటిష్ఠంగా అమలుచేస్తున్నారు. రాత్రి కర్ఫ్యూ కొనసాగుతున్నది.


logo