ఆదివారం 12 జూలై 2020
National - Jun 26, 2020 , 19:26:09

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ

క‌ర్ణాట‌క‌లో క‌రోనా విజృంభ‌ణ

బెంగ‌ళూరు: క‌ర్ణాట‌క‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న‌ది. ప్ర‌తిరోజు వంద‌ల్లో కొత్త కేసులు న‌మోద‌వుతున్నాయి. శుక్రవారం కూడా కొత్త‌గా 445 మందికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆ రాష్ట్రంలో న‌మోదైన మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య ప‌ద‌కొండు వేల మార్కును దాటి 11,005కు చేరింది. అందులో 6,916 మంది వైర‌స్ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 3,905 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారంతా రాష్ట్రంలోని వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక క‌ర్ణాట‌క‌లో ఇప్ప‌టివ‌ర‌కు మృతిచెందిన క‌రోనా బాధితుల సంఖ్య 180కి చేరింది. క‌ర్ణాట‌క ఆరోగ్య శాఖ ఈ వివ‌రాల‌ను వెల్ల‌డించింది.  


logo