మంగళవారం 26 మే 2020
National - May 16, 2020 , 15:45:22

ఢిల్లీలో కొత్తగా 438 మందికి కరోనా

ఢిల్లీలో కొత్తగా 438 మందికి కరోనా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి మరింత విజృంభిస్తున్నది. ప్రతిరోజు కొత్త కేసులు వందల్లో పెరుగుతున్నాయి. శనివారం కూడా కొత్తగా 438 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య తొమ్మిది వేల మార్కును దాటి 9,333కు చేరింది. అందులో 5,278 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. శనివారం కొత్తగా మరో ఆరుగురు మరణించడంతో మృతుల సంఖ్య 129కి చేరింది. కాగా, మొత్తం కేసులలో ఇప్పటి వరకు 3,926 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ ఈ వివరాలను వెల్లడించింది.


logo