శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 17:12:07

బిహార్‌లో గడిచిన 24 గంటల్లో 431 కరోనా కేసులు

బిహార్‌లో గడిచిన 24 గంటల్లో 431 కరోనా కేసులు

పాట్నా : బిహార్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 431 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ మొత్తం కేసుల సంఖ్య 28,564కు చేరింది. అయితే బిహార్‌లో నిన్న మొన్నటి వరకు 678, ఆపై కేసులు నమోదు కాగా తాజాగా వాటి సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పటివరకు 179 మంది కరోనాతో మృతిచెందారు. బిహార్‌లో వరదలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా భారీ వర్షాల కారణంగా రాష్ర్టంలోని పలు జిల్లాలు నీటమునిగాయి. మరో రెండు రోజుల పాటు అక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనాతో సతమతమవుతుంటే తాజాగా ఈ వరదలు కొత్త తలనొప్పిని తెచ్చి పెట్టాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo