గురువారం 06 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 12:15:01

పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా

పెళ్లికి హాజరైన 43 మందికి కరోనా

తిరువనంతరపురం : కరోనా మహమ్మారి ఓ వైపు విజృంభిస్తున్నది. ప్రభుత్వం సూచిస్తున్న మార్గదర్శకాలు పాటించాలని చెబుతున్న కొందరు పట్టించుకోవడం లేదు. వీలైనంత తక్కువ మందితో శుభ కార్యాలు చేసుకోవచ్చని సడలింపులు ఇవ్వడంతో కార్యక్రమాలు ఎక్కువ జరుగుతున్నాయి. కేరళ రాష్ట్రంలో ఓ వివాహ కార్యక్రమానికి హాజరైన 43 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, వధువు తండ్రిపై కేసు నమోదైంది. జూలై 17న కాసర్గోడ్‌లోని చెంగలాలో జరిగిన వివాహ కార్యక్రమం తర్వాత వధూవరులు నోవెల్‌ కరోనా వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు.

ఆ తర్వాత వివాహ కార్యక్రమానికి హాజరై వ్యక్తులను నిర్బంధంలో ఉండాలని లక్షణాలుంటే, సమీప ఆరోగ్య కేంద్రాన్ని సంపద్రించాలని జిల్లా కలెక్టర్‌ సూచించారు. ఇందులో సుమారు 43 మందికి వైరస్‌ పాజిటివ్‌గా పరీక్షించారు. దీనిపై కాసర్గోడ్ జిల్లా అథారిటీ కేసు నమోదు చేసింది. కేరళ ఎపిడెమిక్ డిసీజెస్ ఆర్డినెన్స్ 2020 కింద వధువు తండ్రిపై బడియుడుక్కా పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో ఆదివారం 927 కొవిడ్ -19 పాజిటివ్‌ కేసులు, రెండు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో 9,655 క్రియాశీల కేసులున్నాయి.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo