గురువారం 28 మే 2020
National - May 09, 2020 , 12:20:59

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

ఏపీలో కొత్తగా 43 కరోనా కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 43 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,930కు చేరింది. ఒక రోజు వ్యవధిలోనే ముగ్గురు మరణించారు.  శనివారం ఉదయం వరకు కరోనా వల్ల మొత్తం 44 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 1999 మంది కరోనా రోగులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ్టి వరకు 887 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు.  

కృష్ణా(16), చిత్తూరు(11), విశాఖ(05), కర్నూలు(06), అనంతపురం(03), గుంటూరు(02) జిల్లాలో కొత్తగా కోవిడ్‌-19 కేసులు వెలుగులోకి వచ్చాయి. కృష్ణా జిల్లాలో ఇద్దరు, కర్నూలులో ఒకరు కరోనా వల్ల మృతి చెందారు. 


logo