బుధవారం 03 జూన్ 2020
National - May 15, 2020 , 17:08:56

ఢిల్లీలో 24 గంటల్లో 425 పాజిటివ్‌ కేసులు

ఢిల్లీలో 24 గంటల్లో 425 పాజిటివ్‌ కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్నది. గురువారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు కేవలం 24 వ్యవధిలో 425 కొత్త కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఢిల్లీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,895కు చేరిందని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని, అయితే ఇప్పటి వరకు ఢిల్లీలో మొత్తం మరణాల సంఖ్య 123కు చేరిందని తెలిపింది. మొత్తం పాజిటివ్‌ కేసులలో 3,518 మంది వైరస్‌ బారి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, మరో 5,254 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని ఢిల్లీ ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారంతా వివిధ ఆస్పత్రుల్లోని ఐసోలేషన్‌ కేంద్రాల్లో చికిత్స పొందుతున్నారని తెలిపింది.


logo