బుధవారం 03 జూన్ 2020
National - Apr 04, 2020 , 17:32:27

కరోనా బాధితుల్లో వీళ్లే ఎక్కువ..

కరోనా బాధితుల్లో వీళ్లే ఎక్కువ..

న్యూఢిల్లీ:  ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో  కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ జాయింట్‌ సెక్రటరీ లవ్‌ అగర్వాల్‌ వెల్లడించారు. కరోనాపై రాష్ట్రాలు పాటించాల్సిన సూచనలను వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. 17 రాష్ట్రాల్లో తబ్లీగీ మర్కజ్‌ సంబంధించిన కేసులు 1023గా ఉన్నట్లు గుర్తించామన్నారు.  కేరళ, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 58 మంది కరోనా పేషెంట్ల  పరిస్థితి  సీరియస్‌గా ఉందని వివరించారు.   కరోనా బాధితుల్లో ఏ వయసు వారు ఎక్కువగా ఉన్నారన్న వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. 

 

పాజిటివ్‌ కేసుల్లో 21 నుంచి 40 ఏండ్ల వయసువారు 42శాతం  

 కరోనా బాధితుల్లో 41 నుంచి 60 ఏళ్ల వయసువారు 33శాతం  

 కోవిడ్‌-19 సోకిన వారిలో 17శాతం మంది 60 ఏళ్లు పైబడినవారు.  

కరోనా బాధితుల్లో 9శాతం 20ఏళ్లలోపు వ్యక్తులే ఉన్నారు.  


logo