శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 31, 2020 , 13:13:24

యూపీ:42 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్‌

యూపీ:42 మంది కరోనా పేషెంట్లు మిస్సింగ్‌

లక్నో: ఉత్తర్‌ప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. ఘాజీపూర్‌లో కరోనా సోకిన 42 మంది జాడ తెలియకపోవడంతో  స్థానికులు  ఆందోళన చెందుతున్నారు. కరోనా టెస్టుల సమయంలో 42 మంది తప్పుడు ఫోన్‌ నంబర్లు,  చిరునామాలను ఇచ్చారని అధికారులు తెలిపారు.   శాంపిళ్ల సేకరణ సమయంలో వీరు ల్యాబ్‌లకు తప్పుడు ఫోన్‌ నంబర్లు, చిరునామాలు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు.

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన 42 మంది  ఆచూకీ‌ తెలియడంలేదని  అదనపు జిల్లా మేజిస్ట్రేట్‌కు రాసిన లేఖలో ఘాజీపూర్‌ అడిషనల్‌ చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ కేకే వర్మ పేర్కొన్నారు.  వీరంతా ఆస్పత్రి లేదా హోం ఐసోలేషన్‌లో కూడా లేరని ఆయన వెల్లడించారు.  కనిపించకుండా పోయిన కరోనా రోగులను పట్టుకునేందుకు  బృందాలను ఏర్పాటు చేసినట్లు  లేఖలో వివరించారు.  ఘాజీపూర్‌ జిల్లాలో 505 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనా వల్ల 10 మంది చనిపోయారు. logo