శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 01, 2021 , 11:48:41

తెగ తినేశారు.. జొమాటోలోనే నిమిషానికి 4100 ఆర్డ‌ర్లు!

తెగ తినేశారు.. జొమాటోలోనే నిమిషానికి 4100 ఆర్డ‌ర్లు!

న్యూఢిల్లీ: ఈసారి కొవిడ్ కార‌ణంగా దేశంలోని చాలా న‌గ‌రాల్లో కొత్ ఏడాది వేడుక‌ల‌పై నిషేధం విధించారు. కొన్ని న‌గ‌రాలు రాత్రి పూట క‌ర్ఫ్యూలు కూడా పెట్టాయి. సాధ్య‌మైనంత వ‌ర‌కూ ప్ర‌జ‌ల‌ను ఇళ్ల‌లోనే న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకునే విధంగా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్రోత్స‌హించాయి. దీంతో చాలా మంది డిసెంబ‌ర్ 31న ఇంట్లో కూర్చొనే విప‌రీతంగా ఫుడ్ ఆర్డ‌ర్లు చేసేశారు. ఏ రేంజ్‌లో తిన్నారంటే.. ఒక్క జొమాటోనే గ‌రిష్ఠంగా నిమిషానికి 4100 ఆర్డ‌ర్లు వ‌చ్చాయ‌ట‌. ఈ విష‌యాన్ని ఆ సంస్థ సీఈవో దీపింద‌ర్ గోయ‌ల్ ట్విట‌ర్ ద్వారా వెల్ల‌డించారు. ఈ నంబ‌ర్స్ చూసి ఆయ‌న ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. సాయంత్రం స‌య‌మానికి నిమిషానికి 2500 ఉన్న ఆర్డ‌ర్ల సంఖ్య క్ర‌మంగా పెరుగుతూ 4100కు చేరిన‌ట్లు చెప్పారు. ఒక‌ద‌శలో  ల‌క్ష లైవ్ ఆర్డ‌ర్లు ఉన్న‌ట్లు కూడా గోయ‌ల్ ట్వీట్ చేశారు. ఇది గ‌తంలో ఎన్న‌డూ చూడ‌లేద‌ని ఆయ‌న అన్నారు. ఇండియ‌న్స్ ఎక్కువ‌గా పిజ్జాలు, బిర్యానీలు ఆర్డ‌ర్ చేసిన‌ట్లు గోయ‌ల్ చెప్పారు.