ఆదివారం 05 జూలై 2020
National - Jun 28, 2020 , 11:09:05

ఒక్క రోజే 20 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు

ఒక్క రోజే 20 వేల‌కు చేరువ‌లో పాజిటివ్ కేసులు

న్యూఢిల్లీ : దేశంలో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండవం చేస్తోంది. అన్ని రాష్ర్టాల‌కు క‌రోనా విస్త‌రించింది. పాజిటివ్ కేసులు అధిక‌మ‌వుతున్నాయి. దేశ వ్యాప్తంగా గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 19,906 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. 410 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ శాఖ వెల్ల‌డించింది. దేశంలో పాజిటివ్ కేసుల సంఖ్య 5,28,859కి చేరుకోగా, మ‌ర‌ణాల సంఖ్య 16,095కు చేరింది. మొత్తం పాజిటివ్ కేసుల్లో యాక్టివ్ కేసులు 2,03,051. 3,09,713 మంది ఈ వైర‌స్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. 


logo