బుధవారం 15 జూలై 2020
National - May 02, 2020 , 15:24:19

ఒకే ఇంట్లో 41 మందికి కరోనా వైరస్‌

ఒకే ఇంట్లో 41 మందికి కరోనా వైరస్‌

ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని కపాషెరాలో ఒకే బిల్డింగ్‌లో ఉంటున్న 41 మందికి కరోనా వైరస్‌ సోకింది. కపెషెరాలోని జిల్లా కలెక్టర్‌ ఆఫీస్‌ సమీపంలో థెకే వాలి గాలిలో ఈ భవనం ఉన్నది. అందులో ఉంటున్న ఒక వ్యక్తికి ఏప్రిల్‌ 18న కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఏప్రిల్‌ 19న ఆ భవనాన్ని అధికారులు సీజ్‌ చేసి, అందులో ఉంటున్న 67 మందిని క్వారంటైన్‌కు తలించారు. శనివారం వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా 41 మందికి పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో ఆ బిల్డింగ్‌ చుట్టు పక్కల నివాసముంటున్న 175 మంది నుంచి నమూనాలు సేకరించిన అధికారులు ఆ ప్రాంతాన్ని సీజ్‌ చేశారు. 

ఢిల్లీలో ఇప్పటివరకు 3,738 కరోనా కేసులు నమోదవగా, 61 మంది వైరస్‌ బాధితులు మరణించారు. 


logo