శుక్రవారం 05 జూన్ 2020
National - May 09, 2020 , 18:27:07

కొత్త‌గా 41 పాజిటివ్ కేసులు..మొత్తం 794

కొత్త‌గా 41 పాజిటివ్ కేసులు..మొత్తం 794

బెంగళూరు: కర్ణాటకలో క‌రోనా పాజిటివ్ కేసులు అంత‌కంత‌కూ పెరిగిపోతున్నాయి.  ఇవాళ ఒక్క రోజే రాష్ట్రంలో 41 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ‌రాష్ట్రంలో మొత్తం క‌రోనా పాజిటివ్ కేసుల సంఖ్య 794కు చేరుకుంది. వీటిలో 377 కేసులు యాక్టివ్ గా ఉండ‌గా.. 386 మంది కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు. రాష్ట్రంలో ఇప్పవ‌ర‌కు క‌రోనాతో 30 మంది మృతి చెందార‌ని క‌ర్ణాట‌క‌ వైద్యారోగ్య శాఖ ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించింది. 

కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో క‌ర్ణాట‌క లో ప్ర‌జ‌లు లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించేలా పోలీసులు ఎప్పుటిక‌పుడు సూచ‌న‌లు జారీచేస్తున్నారు. నిబంధ‌న‌లు అతిక్ర‌మించిన వారిపై కేసులు న‌మోదు చేసి, అత్య‌వ‌స‌రం లేకున్నా రోడ్ల‌పై వ‌స్తున్న వారి వాహ‌నాల‌ను సీజ్ చేస్తున్నారు. 



ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo