సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 12:28:46

ఢిల్లీలో 406 కొత్త కేసులు.. 13 మ‌ర‌ణాలు

ఢిల్లీలో 406 కొత్త కేసులు.. 13 మ‌ర‌ణాలు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో కేసుల సంఖ్య క్ర‌మం త‌ప్ప‌కుండా పెరుగుతూనే ఉన్న‌ది. ఆదివారం అర్ధ‌రాత్రి 12 గంట‌ల నుంచి సోమ‌వారం అర్ధరాత్రి 12 గంట‌ల వ‌ర‌కు 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్త‌గా 406 క‌రోనా కేసులు న‌మోద‌య్యాఆయి. దీంతో ఢిల్లీలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 7,639కి చేరింది. ఇక 24 గంట‌ల వ్య‌వ‌ధిలో కొత్తగా 13 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దీంతో మొత్తం మ‌ర‌ణాల సంఖ్య 86కు చేరింది. కొత్త‌గా 383 మంది వైర‌స్ బారి నుంచి కోలుకోవ‌డంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,512కు చేరింది. గ‌తంలో 3, 4 రోజులుగా ఉన్న కేసుల డ‌బులింగ్ రేటు ఇప్పుడు 11 రోజుల‌కు చేరింద‌ని ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి స‌త్యేంద్ర జైన్ తెలిపారు. ఈ డ‌బులింగ్ రేటు 20 నుంచి 25 రోజుల వ‌ర‌కు పెరిగితే ఇక‌ ప్ర‌శాంతంగా ఉండొచ్చ‌ని మంత్రి జైన్ అభిప్రాయ‌ప‌డ్డారు. 

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo