శుక్రవారం 10 ఏప్రిల్ 2020
National - Mar 25, 2020 , 08:00:22

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌.. 402 కేసులు న‌మోదు

లాక్ డౌన్ ఉల్లంఘ‌న‌.. 402 కేసులు న‌మోదు

తిరువనంత‌పురం : క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిని నియంత్రించేందుకు దేశ‌మంతా లాక్ డౌన్ విధించారు. కేర‌ళ ప్రభుత్వంలో నిన్న‌టి నుంచే లాక్ డౌన్ అమ‌ల్లోకి వ‌చ్చింది. లాక్ డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి రోడ్ల‌పైకి వ‌చ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగ‌ళ‌వారం ఒక్క రోజే కేర‌ళ‌లో లాక్ డౌన్ ఉల్లంఘన కేసులు 402 న‌మోదు అయ్యాయి. లాక్ డౌన్ కు ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కేర‌ళ సీఎం పిన‌ర‌యి విజ‌యన్ కోరారు. లాక్ డౌన్ కు స‌హ‌క‌రించ‌పోతే చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని సీఎం హెచ్చ‌రించారు. కేర‌ళ‌లో నిన్న ఒక్క రోజే క‌రోనా పాజిటివ్ కేసులు 14 న‌మోదు అయ్యాయి. మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 105కు చేరుకుంది. దేశ వ్యాప్తంగా క‌రోనా వ్యాధితో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసులు 536.


logo