శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 14:56:22

ఢిల్లీ స్కూళ్లో 40 మంది విద్యార్థుల‌కు కరోనా ప‌రీక్ష‌లు

ఢిల్లీ స్కూళ్లో 40 మంది విద్యార్థుల‌కు కరోనా ప‌రీక్ష‌లు

హైద‌రాబాద్‌:  నోయిడా సెక్టార్‌లోని శ్రీరామ్ మిలీనియం స్కూల్‌లోని 40 మంది పిల్ల‌ల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. స్కూల్‌ను రెండు రోజుల పాటు మూసివేశారు.  తుది ప‌రీక్ష‌లను కూడా కొన్నాళ్ల పాటు వాయిదా వేశారు.  ఇటీవ‌ల ఇట‌లీ నుంచి ఢిల్లీ వ‌చ్చిన ఓ వ్య‌క్తికి క‌రోనా పాజిటివ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్లు గుర్తించిన విష‌యం తెలిసిందే.  అయితే ఆ వ్య‌క్తికి సంబంధించిన కుమారుడు శ్రీరామ్ మిలీనియం స్కూల్‌లో చ‌దువుతున్నాడు.  40 మంది విద్యార్థుల‌ను 28 రోజుల పాటు ఐసోలేష‌న్‌కు పంపుతున్న‌ట్లు చీఫ్ మెడిక‌ల్ ఆఫీస‌ర్ అనురాగ్ భార్గ‌వ‌ తెలిపారు.  స్కూల్‌ను శుద్ధి చేయ‌నున్న‌ట్లు పేర్కొన్నారు.


logo