బుధవారం 03 జూన్ 2020
National - Apr 09, 2020 , 01:07:05

పేదరికంలోకి భారత్‌!

పేదరికంలోకి భారత్‌!

  • కరోనాతో 40 కోట్ల మంది ఉపాధిపై దెబ్బ 
  • ప్రపంచ కార్మిక సమాఖ్య హెచ్చరిక 

ఐక్యరాజ్యసమితి: కరోనా విశ్వమారి ప్రభావంతో భారతదేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని ప్రపంచ కార్మిక సమాఖ్య (ఐఎల్వో) హెచ్చరించింది. దేశంలోని అసంఘటితరంగ కార్మికుల్లో దాదాపు 90 శాతం మంది ఉపాధి కోల్పోతారన్నది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 19.5 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉన్నదని హెచ్చరించింది. 

200 కోట్ల మంది.. 

ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులున్నారు. ఇందులో ఎక్కువమంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారు. కరోనాతో  వీరంతా ఉపాధి కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు. భారత్‌తోపాటు బ్రెజిల్‌, నైజీరియా వంటి దేశాల్లో లాక్‌డౌన్‌తో అసంఘటిత రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. 

తీవ్రంగా ప్రభావితమయ్యే రంగాలు 

ఆతిథ్యరంగం, ఆహారం, తయారీ, రిటైల్‌, వ్యాపారాలు, అడ్మినిస్ట్రేటివ్‌ కార్యకలాపాలు. ఫలితంగా 125 కోట్ల మంది ఉద్యోగం కోల్పోవడమో లేదా జీతాలు తగ్గడం, పని గంటలు తగ్గించడం వంటివి జరుగొచ్చు. 

గట్టెక్కడానికి నాలుగు సూత్రాలు 

1.వ్యాపార, వాణిజ్య సంస్థలకు ప్రభుత్వాలు మద్దతుగా నిలువడం, 2.ఆర్థిక వ్యవస్థను, ఉద్యోగాలను స్థిరీకరించడం. 3. కార్మికులను, సంస్థలను కాపాడుకోవడం. 4.ప్రభుత్వం, కార్మికులు, ఉద్యోగుల మధ్య చర్చలు జరిపి, పరిష్కారాలు కనుగొనడం. 


logo